తాండూరు, మే 21 (way2newstv.com)
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 28 వర్ధంతి సందర్భంగా తాండూరు లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలెట్ రోహిత్ రెడ్డి, ఇతర నేతలు పాల్గోన్నారు. రాజీవగాంధీ చిత్రపటానికి పూలమాలలు నివాళులుఅర్పించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరువాత కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాజీవ్ హయాంలో దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం కరం మొదలైందని అన్నారు. శ్యాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని దేశానికి రాజీవ్ దేశానికి అందించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.
తాండూరులో రాజీవ్ వర్ధంతి
అయన చూపిన బాటలోనే నేడు దేశం కంప్యూటర్ యుగంలో దూసుకుపోతోందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషిచేసారు అని అన్నారు. అయన హయాంలోనే పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ చారి, నర్సింలు, నయుమ్ అప్ఫు, సర్ధార్ ఖాన్, లింగదలి రవి, మహేష్ ఠాకూర్, కొర్వర్ నగేష్, విజయ్, సంతోష్ గౌడ్, అనిల్ బౌండ్ పలువురు కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
telangananews