హిందూపురం డాక్యుమెంటర్లు కొత్త వ్యూహాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హిందూపురం డాక్యుమెంటర్లు కొత్త వ్యూహాలు

అనంతపురం, మే 14, (way2newstv.com)
హిందూపురం సబ్‌రిజిస్టర్‌ కార్యాలయం అవినీతి అక్రమాలకు మారుపేరు అక్కడ..డాక్యుమెంట్ రైటర్లు చెప్పిందే వేదం. అధికారులతో సమానంగా స్టాంప్‌వెండర్లు, డాక్ట్యుమెంట్‌ రైటర్లు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు అంటే ఎవరూ నమ్మరు గానీ ఇది అక్షరాల సత్యం. గతంలో కోర్టులో వివాదంలో ఉన్న స్థలాలతో పాటు ఎన్‌ఒసి తీసుకుని అధికారులు సబ్‌రిజిస్టర్‌ చేసిన సంఘటనలు జరిగాయి.. ఇక్కడ రిజిస్ట్రేషన్‌కు వస్తే తప్పని సరిగా మామూళ్ళు సమర్పించుకోవాల్సిందే.జిల్లాలోనే హిందూపురం సబ్‌రిజిస్టర్‌ కార్యాలయానికి ఉన్నంత పని ఒత్తిడి జిల్లా కేంద్రంలో ఉన్నా కార్యలయానికి సైతం ఉండదు. ఇక్కడ ప్రతి రోజు 30 నుంచి 50 వరకు నూతన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 


హిందూపురం డాక్యుమెంటర్లు కొత్త వ్యూహాలు

ఒకొక్క రిజిస్ట్రేషన్‌కు కనీసం రూ.2 నుంచి 3వేలు ముట్టజెప్పాల్సిందే. జిల్లాలో కదిరి తర్వాత ఎక్కువ శాతం హిందూపురంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. హిందూపురం సబ్‌రిజిస్టర్‌ కార్యాలయం ఏ సమయంలో చూసినా బిజి బిజిగా ఉంటుంది. ఇక్కడ జిల్లాలో ఎక్కడ లేని విధంగా రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్లు ఉన్నారు ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ఎసిబి అధికారులు తరచు దాడులు చేసే పరిస్థితి. దాడుల నుంచి తప్పించుకోవడానికి పెద్ద ఎత్తుగడ వేశారు. వాహనాలను అడ్డంగా పెట్టిస్తే త్వరగా ఎవరు లోపలికి రాలేరు వచ్చే వారిని పసి గట్టవచ్చు అని దాదాపు 500 పైగా ద్విచక్రవాహనాలు కార్యాలయం ఆవరణంలో నిలుపుతున్నారు. ఇది చాలదన్నట్టు గేటు ముందు భాగంలో సైతం వాహనాలు నిలబెట్టడం వల్ల కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి తీవ్ర సమస్యగా మారిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకొన్నా సంఘటనలు జరిగాయి. వీటన్నింటిపైనా ఆరా తీసినా ఎసిబి అధికారులు ఏ సమయంలోనైనా తనిఖీలు నిర్వహిస్తారని. సబ్‌రిజిస్టర్‌ కార్యలయం సిబ్బంది పట్టణంలో ఉన్నా వాహనాలన్నింటిని కార్యాలయ ఆవరణంలో నిలుపుతున్నప్పటికి అధికారులు ఒక్కమాట కూడా మాట్లాడక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.