సరిలేరు నీ కెవ్వరు షూటింగ్ ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సరిలేరు నీ కెవ్వరు షూటింగ్ ప్రారంభం


హైద్రాబాద్, మే 31 (way2newstv.com)
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడే మహేష్ ఈ కొత్త సినిమాను ప్రారంభిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజును పురష్కరించుకుని  ఈ సినిమా టైటిల్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ టైటిల్ పోస్టర్‌ను మహేష్ బాబు విడుదల చేశారు. సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 9.18 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలుపంచుకున్నారు. 


సరిలేరు నీ కెవ్వరు  షూటింగ్ ప్రారంభం
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ బాబు సైనికుడిగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఏకే 47 గన్, దానిపై సైనికులు పెట్టుకునే హెల్మెట్‌ను టైటిల్‌లో పొందుపరిచారు. ‘F2’‌తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. మహేష్ బాబుతో ఇంకెలాంటి హిట్టు కొడతారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక విభాగాన్ని ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఈ ప్రటకన కూడా చేస్తారు. అయితే, మహేష్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందనను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.