కౌతాళం మే 21 (way2newstv.com)
కౌతాళం మండలం లో గ్రామీణ ప్రజల నీటి కోసం గొంతెండుతున్న పల్లె వాసులకు మాత్రం నీటి కటకట తప్పడం లేదన్నారు. గ్రామ ప్రజలకు దాహార్తినీ తీర్చడం లో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఎరిగేరి గ్రామస్తులు వాపోయారు.హనవలు చెరువు నుండి రావల సిన నీరు మూడు రోజుల అయిన చుక్క నీరు రాలేదని వాపోయారు. హనవాలు లో కరెంట్ స్తంభం విరిగి పడటంతో మరమ్మతులు మూడు రోజులు పట్టిందని గ్రామ వాసులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణమే మండల పరిధిలో వివిధ గ్రామాల నుండి నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
గొంతెండుతున్న పల్లెలు
వేసవి కాలం కావడంతో ఎండల బాగా ముదిరి బోర్లు బావులు గొట్టపు బావులు పూర్తిగా ఎండిపోవడంతో మండల పరిధిలోని వివిధ గ్రామాల తాగునీటి కోసం ట్యాంకుల వద్ద గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది. పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రజానగర్ చెరువులో నీరు ఉన్న పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నీటిని సరఫరా చేయడంలో అధికారుల సమన్వయ లోపం వ్యవహరిస్తుండడంతో నీటి కొరత తీరడం లేదని గ్రామస్తులు వాపోయారు. మండలంలోని ఎరిగెరి, అగసాలా దీన్ని, లింగాలదిన్నె, బాపురం, కౌతాలం, లో కూడా నీటి ని సరియైన సమయంలో సరఫరా చేయడంలో అధికారులు, వాటర్ మేన్ లు విఫల మయ్యరని మండల ప్రజలు తెలిపారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్లు పిల్లలకు శుభకార్యాలకు నీటిని 500 నుండి 800 వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
Tags:
News