ఎప్పటికి వచ్చేను.... డిగ్రీ కాలేజీ


అనంతపురం, మే 25, (way2newstv.com)
అనంతపురం జిల్లాల్లో హిందూపురం పట్టణం ఆదర్శ డిగ్రీ కళశాల కలగానే మిగిలిపోనుంది. పట్టణంలో ఆదర్శ డిగ్రీ కళశాల ఏర్పాటు చేస్తు రాష్ట్ర ఉన్నత శాఖ అధికారులు 2015వ సంవత్సరం సెప్టంబర్‌ 15న ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. అదే సమయంలో భవన నిర్మాణాలకు గాను రూ 12కోట్లు సైతం మంజూరు చేసింది. 2015-16 విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం కాలేదు. 2016-17 విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభించాలని బాలకృష్ణ చేతులు మీదుగా తాత్కాలికంగా శ్రీకంఠపురంలోని ఝాన్సీలక్ష్మిబాయి మున్సిపల్‌ పాఠశాలలో ప్రారంభించారు. వసతులు లేక పోవడంతో విద్యార్థులు ముందుకు రాలేదు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం కాకపోతే కళశాల రద్దు చేసి ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏర్పాటు చేస్తు రాష్ట్ర ఉన్నత శాఖ అధికారులు 2015వ సంవత్సరం సెప్టంబర్‌ 15న ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. అదే సమయంలో భవన నిర్మాణాలకు గాను రూ 12కోట్లు సైతం మంజూరు చేసింది. 2015-16 విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం కాలేదు. 


ఎప్పటికి వచ్చేను.... డిగ్రీ కాలేజీ
2016-17 విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభించాలని బాలకృష్ణ చేతులు మీదుగా తాత్కాలికంగా శ్రీకంఠపురంలోని ఝాన్సీలక్ష్మిబాయి మున్సిపల్‌ పాఠశాలలో ప్రారంభించారు. వసతులు లేక పోవడంతో విద్యార్థులు ముందుకు రాలేదు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం కాకపోతే కళశాల రద్దు చేసి ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక అయిన శాసనసభ్యులు ముఖ్యమంత్రి పార్లమెంట్‌ నుంచి ఎంపికైన ఎంపిలు రాష్ట్ర ప తిగాపనిచేసినప్పటికి పురం అభివృద్ది మాత్రం అంతంత మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తలచి లేపాక్షిలో నవోదయ రెసిడెన్షియల్‌ పాఠశాలతో పాటు పారిశ్రామిక వాడను అభివృద్ధి చేశారు. అనంతరం అదే పార్టీకి చెందిన శాసనసభ్యులు ఎంపికైనప్పటికి ఏ ఒక్కరూ కూడా పురం అభివృద్ధి గురించి, విద్యాభివృద్ధి గురించి కృషిచేయలేదు. హిందూపురం నియోజకవర్గంలో మూడు మండలాలు ఒక స్పెషల్‌ గ్రేడ్‌ పురపాలక సంఘం ఉన్నాయి. మొత్తం జనాభా సుమారు 2.50లక్షల వరకు ఉంది. నియోజకవర్గంలో 10వ తరగతి పూర్తిచేసుకొని ప్రతిసంవత్సరం 6వేలకుపైగా విద్యార్థులు వస్తున్నారు. ఇంటర్‌ పూర్తిచేసుకున్న వారు సుమారు 4వేల వరకు బయటకు వస్తున్నారు. వీరికి తగినన్ని ప్రభుత్వ కళాశాలలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటుంన్నారు. ప్రస్తుతం పట్టణంలో ఒక బాలికల జూనియర్‌ కళాశాల ఒక మహిళా డిగ్రీ కళాశాల, ఒక మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. మిగిలిన కళాశాలలన్నీ ప్రయివేటు కార్పొరేట్‌ కళాశాలవే. ఈ నేపథ్యంలో బడుగు, బలహీననిరుపేద విద్యార్థులు చదువులు కొనలేక అర్ధాంతరంగా చదువు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల సాధన కోసం ఉద్యమాలు చేపట్టింది. దీనిపై స్పందించి స్థానిక శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ, మూడు సంవత్సరాల క్రితం ఆదర్శ డిగ్రీకళాశాలను మంజూరు చేయించి దీనిని తాత్కాలికంగా శ్రీకంఠాపురంలోని ఝాన్సీలక్ష్మీబాయి పాఠశాలలో హంగు, ఆర్భాటంతో ప్రారంభించారు. ప్రారంభానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలకృష్ణ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇవ్వకపోవడంతో అలా ప్రారంభించి ఇలా మూసివేశారు. ఈ కళాశాల నిర్మాణం కోసం రూరల్‌ మండలం రాచపల్లి సమీపంలో సుమారు 9 ఎకరాల స్థల సేకరణ చేపట్టి సంవత్సరం గడుస్తున్నప్పటికి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కలలు కలలుగానే మిగిలిపోయాయి. జూనియర్‌ కళాశాల పరిస్థితి చూస్తే మంజూరయింది గానీ ఎక్కడ ఎప్పుడు ప్రారంభిస్తారన్న వినికిడి మాత్రం లేదు. ఇప్పటికైనా శాసన సభ్యులు బాలకృష్ణ, ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు సహకరించాలని విద్యార్థులు, ప్రజలు పేర్కొంటున్నారు. 
Previous Post Next Post