కరీంనగర్, మే 27 (way2newstv.com):
అసలే కాంక్రీట్ నగరం.. ఆపై వేసవికాలం.. మూడు లక్షల జనాభా. ఆహ్లాదం కరవవుతున్న క్రమంలో ఉన్న ఉద్యానవనం నిర్లక్ష్యానికి గురవుతోంది. నిత్యం ఆదాయం వచ్చే జింకల ఉద్యానంలో చిన్నారులకు ఆహ్లాదం అందని ద్రాక్షగా మారింది. ఆట పరికరాలు పనిచేయవు.. ఉపయోగంలో ఉన్నవైనా సరిగా ఉన్నాయా.. అంటే అదీ లేదు. తక్షణమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాల్సిన యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జింకల ఉద్యాన వనానికి నిత్యం 1000 నుంచి 2 వేల వరకు సందర్శకులు వస్తుంటారు. ఇరత జిల్లాల నుంచీ ఎక్కువ సంఖ్యలో వస్తుండగా తదునుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. సెలవు రోజులు, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుండగా ఒక్కోరోజు లక్షకు పైగా ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఉద్యానం... అద్వాన్నం (కరీంనగర్)
కుటుంబ సమేతంగా వచ్చేందుకు ఆసక్తి చూపుతుండగా.. చిన్నపిల్లల ఆట పరికరాలు సరిపడా లేకపోగా వేచిచూడటం తల్లిదండ్రులకు పరీక్షగా మారింది. ఊయలలు, తోపుడు పరికరాలు, జారుడు బల్లలు, తిరిగే పరికరాలు ఉండగా ఒక్కొక్కటిగా మరమ్మతులకు గురవుతుండగా మూలన పడేస్తున్నారు. ఆట పరికరాలను వినియోగించే చిన్నారుల సంఖ్య నిత్యం 200 వరకు ఉంటోంది. చిన్నపిల్లల్ని ఆడించాలంటే ఆరగంట వరకు పరికరాలు ఖాళీ అయ్యే వరకు వేచిచూడాల్సిందే. అయితే పలు పరికరాలు ప్రమాదకరంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జారుడు పరికరాలు నాలుగుండగా పగుళ్లు చూపాయి. చిన్నారులు జారుతున్న క్రమంలో దుస్తులు చిరిగిపోతుండగా మరమ్మతులు చేయాలని విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు.క్యాంటీన్, పార్కింగ్, జంతువులకు మేత, బోటింగ్‌కు టెండర్లు పిలవాల్సి ఉండగా చోద్యం చూస్తున్నారు. మార్చి నెలలోనే టెండర్ ముగియగా వెంటనే టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. కాగా కాల వ్యవధి పూర్తవడంతో క్యాంటీన్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తుండగా పర్యవేక్షణ కరవైంది. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యానవనానికి వస్తుండగా తినుబండారాల కోసం అదనపు చెల్లింపులు తప్పడం లేదు. ఉద్యాన వన సమీపంలో దుకాణాలు లేకపోవడంతో మళ్లీ నగరానికి చేరుకొని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. టెండర్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాల్సి ఉండగా ఉన్నతాధికారుల కాలయాపన చేస్తున్నారు. జింకల ఉద్యానం పచ్చదనంతో కళకళలాడేది.. మధ్యాహ్న సమయంలోనూ పచ్చిక బయలు మనసుకు ఒకింత ఆహ్లాదాన్నిచ్చేది. కాలక్రమేణా పర్యవేక్షణ అటకెక్కడంతో రూపుకోల్పోతోంది. తుంపర పరికరాలు అలంకారప్రాయంగా మిగలడంతో వాటిని పట్టించుకునేవారే కరవయ్యారు. ప్రధాన ప్రవేశ మార్గంలో కనులవిందుగా కనిపించే ఫౌంటేన్ నీరు లేక వెలవెలబోతోంది. జిల్లాలోని ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. ప్రధానంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు సందర్శించడం పరిపాటి. 30 ఎకరాల విస్తీర్ణం ఉండగా నిత్యం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్క్‌లో సందర్శకుల తాకిడి ఎక్కువ.
Tags:
telangananews