ఒడిశా మే 6 (way2newstv.com)
ఫణి తుపాను అతలాకుతలం చేసిన ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పాటు గవర్నర్ గణేషి లాల్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. సర్వే సందర్భంగా నష్టానికి సంబంధించిన వివరాలను మోదీకి పట్నాయక్ వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ఉన్నతాధికరులతో మోదీ సమీక్షను నిర్వహించారు.
ఫణి తుపాను ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పని చేశాయని తెలిపారు. నవీన్ పట్నాయక్ చాలా చక్కగా విపత్తును ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల మేరకు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించారని, వారిని ప్రశంసిస్తున్నానని చెప్పారు. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించిందని, ఇప్పుడు మరో రూ. 381 కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. తుపాను కారణంగా ఒడిశాలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5వేల తాత్కాలిక పునరావాస కేంద్రాలకు దాదాపు 10 లక్షల మందిని తరలించారు.