హైదరాబాద్ మే 6 (way2newstv.com)
ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రమాదం ఉందని వెల్లడించింది. చిన్నారులు, వృద్ధులు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది.
ఈ నెల 10 వరకు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రమాదం
ఈ నెల 10 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని పేర్కొంది. నిన్నటితో పోల్చుకుంటే ఎండల తీవ్రత పెరిగినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, మంచిర్యాళ, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, వరంగల్, జనగాం, నెల్లూరు, కృష్ణా తదితర జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనంతగిరిలో 30 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా గారలో 32 డిగ్రీలు, అనంతపురం గుదిబండలో 32 డిగ్రీలు, కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.