నిజామాబాద్, మే 6, (way2newstv.com)
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సోమవారం జరిగిన జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజక వర్గం నవిపేట మండలం లో తన స్వగ్రామం పొతంగల్ లోని స్కూల్ లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికలు లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే అన్నారు.
పోతంగల్ లో ఓటేసిన ఎంపీ కవిత
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు గులాబీ పార్టీకి, సీఎం కేసీఆర్ కు పట్టం కట్టాలని ప్రజలు ఉవ్విళ్లూరుతునట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి అని కవిత చెప్పారు. టిఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వంలో అడుగులు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది, కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు. ఎంపి ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనీ, ఈ దిశగా ముందడుగు వేస్తున్నట్లు కవిత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, కారు గుర్తుకు ఓటు వేసి, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను గెలిపించాలని కవిత కోరారు. ఎంపి కవిత వెంట టిఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రావు, మోహన్ రెడ్డి ఉన్నారు.