పనులు లేక వలస బాటలో కూలీలు
కౌతాళం మే 13, (way2newstv.com)
కౌతాళం గ్రామంలో మేజరు గ్రామ పంచాయతీ లో ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారుఎ. గ్రామం లో 4000 మందికి జాబ్ కార్డు వున్నాయి. 140 పైగా శ్రమ శక్తి సంఘం గ్రూపులు ఉన్నాయి. ఇందులో మొత్తం గ్రూపులు కలిపి 300 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. మిగతా వాళ్లకు పనులు కల్పించడం లేదు, సీనియర్ మేట్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉపాధి కూలీలు తెలిపారు. వీరికి పై అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్ఆరు.
ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం
గత సంవత్సరంలో పనులు కల్పించేందుకు నవంబర్ డిసెంబర్ నెలల్లో పనులు నందు గుర్తించారు. ఎస్టిమేషన్ గా 100రోజులకు 140 గ్రూపులకు గాను 209 చోప్పున వేయించాలి. కాకాపోతే, తే 140 గ్రూపులకు సరిపడా పనులు గుర్తించి 19- 20 ఒక సంవత్సరం వరకు పనులు కల్పించాలి. కానీ ఇప్పటివరకు పనులు గుర్తించడంలో నిర్లక్ష్యం వహించి గ్రూపు లో పనులకు పోవడానికి ఏ పని ప్రారంభంకాక, ఎలక్షన్ కోడ్ అని ఉపాధి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వస్తున్నారు. మండలంలో పలువురు వలసలకు వెళ్లడంతో పనులకు రావడం కష్టమైంది. కౌతాలం గ్రామంలో పనులు లేక వలస బాట పడుతున్నారు. సీనియర్ మేట్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి లేదా శ్రమ శక్తి గ్రూపుకు నిరుద్యోగ భృతి కల్పించాలని ఉపాధి ప్రజలు కోరుతున్నారు.