జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి , మే 02 (way2newstv.com):
జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలు సజావుగా జరిగేలా పక్కా పర్యవేక్షణ ఉండాలని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నియమించిన మైక్రో పరిశీలకులకు ఆమె గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపి ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థ ఎన్నికలు చాలా సున్నితంగా ఉంటాయని, చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించి సజావుగా ఎన్నికలు జరిగేలా చుడాలని అన్నారు. జిల్లాలో రెండు విడతలో 138 ఎంపిటిసి, 13 జడ్పీటిసి స్థానాలకు స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహిస్తున్నామని, మొదటి విడత స్థానిక సంస్థ ఎన్నికలు పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, మంథని, ముత్తారం, కమాన్ పూర్, రామగిరి మండలాలోని 7 జడ్పీటిసి, 69 ఎంపిటిసి స్థానాలకు మే 6 న, రెండవ విడతలో పెద్దపల్లి ,జూలపల్లి, సుల్తానాబాద్,ఎలిగెడు, శ్రీరాంపూర్, ఓదెల మండలాలోని 6 జడ్పీటిసి, 69 ఎంపిటిసి స్థానాలకు మే 10,2019న పోలింగ్ జరుగుతుందని, దీనికి అనుగుణంగా రెండు దశలకు కలిపి 263 ప్రదేశాలను గుర్తించి అందులో 744 పోలింగ్ కేంద్రాలను ఎర్పాటు చేసామని,3,75,050 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా పక్కాగా పర్యవేక్షించాలి
సానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన 50 మంది మైక్రో పరిశీలకులను నియమించామని, వారు నేరుగా ఎన్నీకల సాధారణ పరిశీలకులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లో భాగంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను విభజించడం జరిగిందని, 113 ప్రదేశాల నుంచి 266 సాధారణ, 95 ప్రదేశాల నుంచి 254 సెన్సిటివ్, 55 ప్రదేశాలలో గల 224 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్స్ టివ్ గా గుర్తించామని, ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో నియమించిన వారు మరింత అప్రమత్తంగా వుండాలని తెలిపారు. ఎన్నికల్లో ఎంపిటిసి కు గులాభీ రంగు బ్యాలెట్, జడ్పీటిసి సభ్యులకు తెల్ల రంగు బ్యాలేట్ కాగితాలను ఉపయోగించడం జరగుతుందని, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం బ్యాలేట్ బాక్సులను సీల్ చేసి సమీపంలో గల స్ట్రాంగ్ రూంలకు తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో మైక్రో పరిశీలకులు కీలక పాత్ర పోషించాలని, వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలో విధులు నిర్వహించే వారి ఫోన్ నెంబర్లు, స్థానిక ఎన్నీకల అధికారుల ఫోన్ నెంబర్లు అందజేయడం జరుగుతుందని, సందేహలను, సమస్యలను ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద సదుపాయాలను మైక్రో పరిశీలకులు గమనించాలని, శాంతిభద్రతలు పకడ్భందిగా వుండేలా చుడాలని, పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు వాహనాలను అనుమతించడానికి వీలు లేదని, ఈ పరిసరాల్లో ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని, ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించిన గుర్తులు లేకుండా ఓటర్ స్లిప్పులు ఉండేలా చుడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో కమిషన్ నిబంధనల మేరకు ఎర్పాట్లు ఉండాలని, ఓటరు కు రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా తీసుకునేలా చుడాలని, ఓటరు భద్రతను సంరక్షించాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని రకాల ఎర్పాట్లను చేయాలని, వేసవిని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా మంచి నీటి సౌకర్యం కల్పించాలని,నీడ సౌకర్యం ఉండేలా చుడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద కొన్నీ కుర్చిలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వారికి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైన వసతులు కల్పిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద దివ్యాంగుల కొరకు అవసరమైన వీల్ చైర్స్ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలో ఒటరు సీక్రసి ఆప్ ఓటింగ్ ఉందో లేదో మైక్రో పరిశీలకులు పరిశీలించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం మైక్రో పరిశీలకులకు వారి విధి నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, నిర్వహించవలసిన విధుల పట్ల పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ శిక్షణ అందించారు. లైజెన్ అధికారి వినోద్ కుమార్, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో పరిశీలకులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.