అసలు రిటన్ గిఫ్ట్ ఎవరికి ?


హైదరాబాద్ మే 23  (way2newstv.com
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగానే కాదు.. ఊహించని రీతిలో వచ్చాయని చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాజా ఎన్నికల ఎపిసోడ్ లో ఇద్దరు చంద్రుళ్లు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నోట మాట రాని రీతిలో ఎన్నికల ఫలితాలు వెలువడితే.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు సైతం షాక్ తగిలేలా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పాలి.ముందస్తు ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన కేసీఆర్.. తాజాగా ఎంపీ ఎన్నికల్లో తాము కచ్ఛితంగా 16 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. అదే సమయంలో.. ఏపీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న మాటను చెప్పారు. 


అసలు రిటన్ గిఫ్ట్ ఎవరికి ?
ఎన్నికల వేళ.. ఈ రిటర్న్ గిఫ్ట్ మాట భారీగాప్రాచుర్యం పొందటమే కాదు.. చంద్ర బాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందన్న చర్చ భారీగా సాగింది.విచిత్రమైన విషయం ఏమంటే.. జగన్ గెలుపుతో కేసీఆర్ బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా అనుకుంటే.. తాజాగా  వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కేసీఆర్ సారుకు భారీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్లుగా చెప్పాలి. తమ బాగోగులు చూసుకోమంటూ అధికారాన్ని కట్టబెడితే.. ఆ విషయాన్ని వదిలేసి.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చేయటం.. ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పుతానంటూ చెబుతున్న ఆయన మాటలకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. బాబుకు రిటర్న్ గిఫ్ట్ ను ఇచ్చే విషయంలో చూపించినంత శ్రద్ధ.. తనకెవరూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశాన్ని ఇవ్వకూడదన్న విషయాన్ని కేసీఆర్ మిస్ కావటంతో ఆయన భారీ మూల్యాన్ని చెల్లించక తప్పలేదు. 
Previous Post Next Post