రవిప్రకాశ్ ను ఏ 'బాబు' రక్షిస్తాడో చూడాలి!: విజయసాయి రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రవిప్రకాశ్ ను ఏ 'బాబు' రక్షిస్తాడో చూడాలి!: విజయసాయి రెడ్డి

హైదరాబాద్ మే 15(way2newstv.com)    
తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు.


రవిప్రకాశ్ ను ఏ 'బాబు' రక్షిస్తాడో చూడాలి!: విజయసాయి రెడ్డి 

పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి" అని వ్యాఖ్యానించారు.