(way2newstv.com)
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం `రాజుగారిగది` ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు ఫ్రాంచైజీగా `రాజుగారి గది 3` గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమా నిర్మితమవుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
మన్నా, ఓంకార్ కాంబినేషన్‌లో లాంఛనంగా ప్రారంభమైన `రాజుగారిగది 3`
"రాజుగారిగది 3"లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా అశ్విన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్‌ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, గౌతంరాజు ఎడిటింగ్, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నారు. నటీనటులు: తమన్నా భాటియా అశ్విన్ బాబు అలీ బ్రహ్మాజీ ప్రభాస్ శ్రీను హరితేజ అజయ్ ఘోష్ ఊర్వశి తదితరులు