జూన్ 9న శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్త్ర కళశాభిషేకం


టిటిడి ఈవో 
తిరుమల, జూన్ 7 (way2newstv.com)
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 9వ తేదీ ఆదివారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్త్ర కళశాభిషేకం నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో  అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం ముఖ్యాంశాలను  మీడియాతో మాట్లాడారు. 


జూన్ 9న శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్త్ర కళశాభిషేకం 

ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ జూన్ 9న ఉదయం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి చెంత శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్త్ర కలశాభిసేకం నిర్వహించనున్నట్లు వివరించారు. ఆదివారం నాడు సమయాబావం వలన మాములు కంటే దర్శనం తగ్గే అవకాశం ఉంది. కావున భక్తులు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని సంయమనంతో శ్రీవారి దర్శనం చేసుకోవలసిందిగా ఈవో కోరారు. 
Previous Post Next Post