మత్స్య కారులకు కాసులు కురిపిస్తున్న చేపలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మత్స్య కారులకు కాసులు కురిపిస్తున్న చేపలు

నల్గొండ, జూన్ 3 (way2newstv.com)
నల్గొండ జిల్లావ్యాప్తంగా  జూన్,జూలై మాసాల్లో మత్స్యశాఖ సర్కార్ ఆదేశానుసారం 211 చెరువుల్లో రూ.2.96కోట్లు వెచ్చించి 3.19కోట్ల చేప పిల్లలు పోశారు. ఇందులో 40శాతం నష్టం పోగా 1.19కోట్ల చేప పిల్లలు బతికి కేజీకి పైగా బరువు అయినట్లు మత్స్యశాఖ చెబుతుంది. అంటే ఆయా చేరువుల్లో 19వేల టన్నుల చేపలు ఉన్నట్లుగా ఆ శాఖ యంత్రాంగం అంటుంది. సొసైటీ, నాన్‌సొసైటీ, ఇతర నీటి వనరులున్న ప్రాంతాల్లో 36 ల టన్నుల చేపలు ఉన్నట్లుగా మత్స్య శాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో మత్స్యకారులు చేపలుపట్టి కేజీ రూ.60నుంచి రూ.80వరకు హోల్‌సెల్‌గా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆయా చెరువుల్లో ఉన్న చేప ఒక్కొటి కేజీ అంతకుమించి ఎదిగాయి. సగటున 36 వేల టన్నులకు కేజీ రూ.70 చొప్పున టన్నుకు రూ.7వేలు అవుతుంది. 36వేల టన్నుల చేప పిల్లలకు దీని ప్రకారంగా రూ.250 కోట్ల రూపాయలు అవుతుంది. 

మత్స్య కారులకు కాసులు కురిపిస్తున్న చేపలు

గతంలో 25శాతం సబ్సిడీతో కొన్ని సొసైటీ చెరువులకు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా మూడేండ్లుగా 100శాతం సబ్సిడీతో ప్రభుత్వం సొసైటీ చెరువులతో పాటు గ్రామ పంచాయతీ చెరువులల్లో చేప పిల్లలను పోస్తుందిగతేడాది కురిసినటువంటి వర్షాలతో జిల్లాలో 50శాతంపైగా 95 పెద్ద చెరువులు, 277 చిన్న చెరువుల్లోకి భారీగా నీరుచేరగా అందులో 211 సొసైటీ చెరువులు పోను 171 గ్రామ పంచాయతీ చెరువుల్లోనూ కొంతమేరకు మత్స్య శాఖ సబ్సిడీ చేపపిల్లలను ఇవ్వగా కొంతమంది ఔత్సాహికులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి సుమారు 2 లక్షల పిల్లలను పోయగా 1.20లక్షల పిల్లలు చేతికి వచ్చాయి. ఇదో 12వేల టన్నుల చేప ఉండగా మూసీ, క్రిష్ణా నదులతోపాటు నాగార్జున సాగర్, ఇతర కాలువల్లో మరో 5 వేల టన్నుల చేప... మొత్తంగా 36వేల టన్నుల చేప మన జలాశాయాల్లో ఉన్నది.జిల్లాలో 147 సొసైటీలు ఉండగా ఆయా సొసైటీల్లో 21వేల మంది సభ్యులు ఉన్నారు. 211 చెరువుల్లోనూ పోసిన చేపలను ఈ మత్స్యకారులు పట్టుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నా రు. దీంతోపాటు సాగర్, మూసీ, కృష్ణానది లాంటి జలాశాయాల్లోనూ ఎక్కువమంది చేపలను పడుతున్నారు. ఫిబ్రవరి 15 నుంచి జూన్ 15 వరకు ప్రతిఏటా మూడు నుంచి 4 నెలల పా టు సర్కార్ పోసిన చేపలను పట్టుకుని విక్రయిస్తూ నెలకు రూ. 30వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్నారు.