న్యూ లుక్ లో పవర్ స్టార్


హైద్రాబాద్, జూన్ 20, (way2newstv.com)
టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ తో సూపర్ స్టార్ గా ఉన్న తరుణంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌ కల్యాణ్‌, తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే, అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన పవన్ కల్యాణ్, నిన్నమొన్నటి వరకూ గడ్డంతో, తెల్ల లాల్చీ, పంచెలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జీన్స్, టీ షర్ట్స్ లోకి వచ్చేశారు. గడ్డాన్ని ట్రిమ్ చేశారు.


 న్యూ లుక్ లో పవర్ స్టార్
పవన్ తాజా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆయన నూతన లుక్ అభిమానులను అలరిస్తోంది. వెండితెరపై రీ ఎంట్రీకి తమ హీరో సిద్ధమయ్యాడని, త్వరలోనే సినిమాల్లో కనిపించడం పక్కా అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ విషయంలో పవన్ ఇంకా తన మనసులోని మాటను వెల్లడించక పోవడం గమనార్హం
Previous Post Next Post