ఇక మండలాధ్యక్షుల ఎన్నికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక మండలాధ్యక్షుల ఎన్నికలు

హైద్రాబాద్, జూన్ 7, (way2newstv.com)
రిషత్ ఎన్నికలు రసవత్తర క్యాంప్ రాజకీయాల ఘట్టానికి చేరాయి. జిల్లా ప్రజాపరిషత్‌కు సంబంధించి టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 32 జడ్పీ చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్ల స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో పడుతున్నాయి. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడి ఎన్నికల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో ‘టగ్ ఆఫ్ వార్’ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు సంబంధించి వివిధ పార్టీలకు లభించిన స్థానాలను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 32 జిల్లాల్లో 538 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 449 స్థానాలు టీఆర్‌ఎస్‌కు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి 75 స్థానాలు లభించాయి. బీజేపీకి ఎనిమిది, స్వంత్రులు, ఇతరులకు 6 స్థానాలు లభించాయి. ఏ ఒక్క జిల్లాలోనూ జడ్పీపీ చైర్పన్, వైస్-చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు వీలుగా కాంగ్రెస్‌కు స్థానాలు లభించలేదు. ఒక్కో జిల్లాలో ఇద్దరిని జడ్పీటీసీ కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోబోతున్నారు కనుక 32 జడ్పీపీ చైర్మన్, వైస్-చైర్మన్ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది.
 నాలుగేళ్లు అసెంబ్లీలో నో వాయిస్...
ఎంపీటీసీ సభ్యుల విషయంలో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు పొందినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కూడా ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు లభించే అవకాశాలున్నాయి. 534 మండలాల్లోని 5,817 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 3,548 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌కు 1,392 స్థానాలు లభించాయి. బీజేపీకి 208 ఎంపీటీసీ సభ్యుల స్థానాలు లభించగా, సీపీఐకి 38, సీపీఎంకు 40, టీడీపీకి 21, గుర్తింపు పొందిన ఇతర పార్టీలకు 20 స్థానాలు లభించగా, 549 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.తొలుత ఎంపీపీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఇంచార్జీలుగా నియామకం అయిన గెజిటెడ్ అధికారుల నేతృత్వంలోనే మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా జరగుతున్నాయి. ఎంపీడీఓలు ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. మండల ప్రజాపరిషత్ మీటింగ్ హాళ్లనే ఎన్నికల ప్రత్యేక సమావేశాలకోసం ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఎంపీపీలకు ఒక కో-ఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎంపీపీ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వాస్తవంగా ఈ నెల 7 న ఇందుకోసం నోటీసు జారీ చేయాలని ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, చాలా ప్రాంతాల్లో విజయం సాధించిన ఎంపీటీసీలకు విజయం సాధించినట్టు ధృవీకరణ పత్రం ఇస్తూనే, కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నోటీసు అందించారు.32 జిల్లాలకు గాను సంగారెడ్డి, కామారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని చాలా మండలాల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనావేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో బీర్పూర్ ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు లభించే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో అమ్రాబాద్ మండలం మాత్రమే కాంగ్రెస్‌కు లభించే అవాశం ఉంది. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో మల్హర్, మహాముత్తారం మండలాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని తెలిసింది.