ప్రాజెక్టు నిర్మాణాలను హర్షించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాజెక్టు నిర్మాణాలను హర్షించాలి


హైదరాబాద్, జూన్ 19  (way2newstv.com)
కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నా నని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మా సింగూర్, మంజీరా సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు నిండనున్నాయి. దీని ద్వారా సంగారెడ్డి ప్రజల,  రైతుల తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రాజెక్ట్ ల నిర్మాణాలు ఏ సర్కార్ హయాంలో జరిగిన హర్షించాల్సిందే నని అన్నారు. 


 ప్రాజెక్టు నిర్మాణాలను హర్షించాలి

రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్,సింగూర్,మంజీరా లాంటి ప్రాజెక్ట్స్ కట్టిన చరిత్ర కాంగ్రెస్ ది. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ లు నిర్మించినా ప్రజలకు .. రైతుల కోసమే .. కాబట్టి వ్యతిరేకించాల్సిన అవసరం లేదని అన్నారు. కాళేశ్వరం లో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉన్నట్లే .. సోనియా తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం ప్రారంభం అయ్యిన ఒక సంవత్సరం లో కాలువలు తవ్వి సింగూరు .. మంజీరా లను నింపాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అలా చేస్తే సంగారెడ్డి ప్రజల పక్షాన కేసీఆర్ కు ఘనంగా సన్మానం చేస్తా. కాళేశ్వరం లో అవినీతి గురించి నాకు తెలియదు. అది మా సీఎల్పీ లీడర్ భట్టి సబ్జెక్టు. ఆయన చూసుకుంటారని అయన అన్నారు.