తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అంటే రాజకీయ పునరావాసకేంద్రంగా మారిపోయిన ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై స్ జగన్ మోహన్‌రెడ్డి అందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ అవుతున్నాడు. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. రాజకీయ పైరవీలు, రాజకీయ పెత్తనంతో తిరుమల పవిత్రత మంటగలిసి పోతున్నది. అర్‌్కుల మధ్య తగాదాలు, అడ్మినిష్ట్రేషన్ లోపాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాత లాంటి అన్ని అవలక్షణాలూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకోవడం కలియుగ దురదృష్టం.
స్వరూపానందేంద్రకు తిరుమల తిరుపతి పీఠం?
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయం సాధించింది.విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్రకు అ పోస్టు ఇచ్చేస్తే అటు తిరుమల పవిత్రతను కాపాడినట్లు ఉంటుంది, ఇటు పార్టీ మొహమాటాల నుంచి తప్పించుకున్నట్లు అవుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని తెలిసింది. విశాఖ పర్యటనలో స్వామీజీ అంగీకరిస్తే టిటిడి చైర్మన్ పీఠంపై స్వామీజీని చూడవచ్చు. ధనంపై ఆశలేని స్వామీజీ తిరుమల తిరుపతిలో జరిగే కైంకర్యాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించి పవిత్రను కాపాడతారని అందువల్ల ఎలాంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని కూడా ఆయన అనుకుంటున్నారు. ఇటీవల భ్రష్టుపట్టిపోయిన ఆ వ్యవస్థను స్వామీజీ చేతుల్లో పెడితే ప్రభుత్వం ఆ వైపు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని తెలిసింది.
Tags:
Andrapradeshnews