ఆశా వర్కర్ల లో ఆనందం వెల్లివిరిసింది.. వైద్య ఆరోగ్య శాఖలో దశాబ్దకాలం పైబడి చాలీ చాలని జీతంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఆశా కార్యకర్తల నెలసరి వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం పరిధిలోని గోపాలపురం పి హెచ్ సి ఆశా వర్కర్లు ఆనందం వ్యక్తం చేశారు.
ఆశా వర్కర్ల ఆనందం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం ఆశ వర్కర్ల కష్టాలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పదవి చేపట్టిన వెంటనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కి తీసుకున్న ఈ నిర్ణయానికి ఆశ కార్యకర్తలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. ప్రజలకి మరిన్ని వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో అత్తిలి జ్యోతి, పల్లి మంగ, విజయ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు