ఉద్యోగులకు వరాల జల్లు


అమరావతి, జూన్ 8 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు.  తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్ హాల్లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ను ప్రకటించారు.  అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.  


ఉద్యోగులకు వరాల జల్లు
అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటన చేశారు.  27 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.  అలాగే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం కావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారని, గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నవాళ్లను తాను తప్పుపట్టనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Previous Post Next Post