ఎమ్మిగనూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం


పలు చోట్ల నేల కూలిన చెట్లు..ఒరిగిన విద్యుత్ స్తంభాలు
ఎమ్మిగనూరు జూన్ 7 (way2newstv.com)
ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు గాలివాన భీభత్సం సృష్టించింది. పెద్దఎత్తున గాలిదుమారంతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలుల భయానక పరిస్థితిని సృష్టించాయి. పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా మారింది. దీంతో పట్టణంలోని హెచ్.బి.ఎస్ కాలనీ, వీవర్స్ కాలనీ, శిల్పా ఎస్టేట్, టేకు చెట్ల పార్క్, సోమప్ప నగర్, పలు చోట్ల చెట్లు నేలకూలాయి. 


ఎమ్మిగనూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
టెలిఫోన్, కేబుల్ తీగలు పలు చోట్ల తెగిపడ్డాయి. రహదారుల వైపు ఉంచిన పలు ఫ్లెక్సీలు తెగి రోడ్డున పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు ఓరిగాయి. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ నిలిచిపోయింది. పలు చోట్ల విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉండి ప్రమాదకరంగా మారాయి. దీంతో విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
Previous Post Next Post