ఆ ఐదుగురు ఎవరు


అమరావతి జూన్ 7 (way2newstv.com)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. దీంతో ఈ ఐదుగురు ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఐదుగురు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉంటారని కూడా జగన్ ప్రకటించడంతో వాళ్లెవరనే చర్చ జోరందుకుంది. 


ఆ ఐదుగురు ఎవరు
అయితే.. ప్రస్తుతం మీడియా వర్గాల్లో ఐదుగురి పేర్లు తెరపైకొచ్చాయి.కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి అవకాశం కల్పించి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక మైనార్టీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ కేటగిరిలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు, ఎస్టీ నుంచి విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు, బీసీ సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి గెలుపొందిన కొలుసు పార్థసారధికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది...
Previous Post Next Post