స్టూడెంట్స్, రైతులకు జూన్ టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్టూడెంట్స్, రైతులకు జూన్ టెన్షన్


కాకినాడ, జూన్ 8, (way2newstv.com)
జూన్‌ వచ్చిందంటే ఒకటే ఆందోళన. పిల్లల చదువుల కోసం, వ్యవసాయ పెట్టుబడులకు ఇదే తరుణం అవ్వడంతో సగటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అధిక రుసుములు, విత్తన, ఎరువులకు అదనపు పెట్టుబడులు తప్పకపోవడంతో ఎంత పక్కాగా ప్రణాళిక చేసుకున్నా చివరిలో ఆందోళనకు గురవ్వకతప్పడం లేదు. అందుకే జూన్‌ వచ్చేసరికి సగటు తల్లిదండ్రులకు అధిక ఖర్చుల వల్ల గుండె వేగం పెరుగుతోంది..ఆర్థికపరమైన చిక్కులు చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. ఎంతగా ప్రణాళికతో ముందుకు సాగినా ఊహించని రీతిలో ఖర్చులు చుట్టుముడుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అప్పు చేసైనా..ముందుకు సాగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించడం కొందరికి పెను భారంగా మారితే..రైతులు ఖరీఫ్‌నకు సన్నద్ధమవడం, పంటల పెట్టుబడులు పెను సవాల్‌గా పరిణమించాయి. ఎటొచ్చి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకే ఫీజులు తడిచి మోపుడవుతున్నాయి. ఆయా కుటుంబాలకు ఇది ఆర్థిక భారమవుతోంది. రూ.వేలకు వేలు చెల్లిస్తే తప్ప ఎల్‌కేజీ, యూకేజీలో కూడా చేర్చలేని దుస్థితి నెలకొంది. తరగతి పెరిగే కొద్దీ ఫీజుల బాదుడూ అలానే ఉంటోంది. ఫీజుల దందాతో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. 


స్టూడెంట్స్, రైతులకు జూన్ టెన్షన్
ఏటేటా విపరీతంగా ఫీజుల భారం పెరిగిపోతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో వారికి వారే ఫీజులు పెంచేసి వసూలు చేసుకుంటున్నారు. ఒక ప్రైవేటు పాఠశాలలో గతేడాది ఆరో తరగతిలో రూ.27 వేలు రుసుం వసూలు చేయగా, ఈఏడాది ఏడో తరగతికి వచ్చేసరికి రూ.34 వేలకు పెంచేశారు. ఏటేటా రుసుములు పెరిగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.ఫీజులతోపాటు వర్క్‌బుక్స్‌, యూనిఫామ్స్‌, ఇతర పుస్తకాలు, తదిర వాటికి రూ.12వేలు వరకు గుంజుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవన్నీ సగటు ప్రజలపై పెను భారంగా పరిణమిస్తున్నాయన్న వాదన వినబడుతోంది.ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఏ తరగతికి ఎంత రుసుములు వసూలు చేయాలన్నది తల్లిదండ్రుల ప్రతినిధులు, ఉపాధ్యాయులుతో కూడిన కమిటీలు నిర్ణయించాలి. కాని విధానంపై ఎక్కడా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాల్లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు  పొందు పర్చటం లేదు.రైతులకు పెట్టుబడి కాలం ఇదే. ఖరీఫ్‌ ఈఏడాది నెల ముందుకు తీసుకు రావటంతో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి మొదలైంది. ఎకరాకు రూ.25వేలు వరకు ఖర్చవుతుంది. విత్తనాల కొనుగోలుతో ఇవి మొదలవుతున్నాయి. ఏటేటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వరివిత్తనాలు కొంత మేరకే రాయితీపై సరఫరా చేస్తుండటంతో మిగిలిన విత్తనాలన్నీ బయట కొనుగోలు చేసుకోవాల్సి పరిస్థితి తలెత్తుతోంది. దీనికి తోడు దుక్కులు, ఆకుమడులు తయారు చేయటం, ఇతర వాటితో కలిపి ఎంతలేదన్నా ఎకరాకు రూ.5వేలు చేతిలో పట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇంకా చేతికి అందక పోవటంతో ప్రైవేటు రుణాలే శరణ్యమవుతున్నాయని ఆక్రోశిస్తున్నారుసాధారణ ప్రయివేటు పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేందుకే రూ.18,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్‌ అయితే చూడనవసరం లేదు. ఇక పదోతరగతికి వేలల్లో, ఇంటర్‌ అయితే లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. వీటితో పాటు  ప్రవేశ రుసుం అని, పుస్తకాలకు , ఏకరూప దుస్తులకు అని వసూళ్లు తప్పడం లేదు. ఇవన్నీ సామాన్య ప్రజానికానికి గుదిబండే.