తొలి సారి సీఎం హోదాలో…


అమరావతి  జూన్ 8, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం తొలిసారి ఆయన సీఎం హోదాలో సచివాలయంలోకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అయనకు ఘనస్వాగతం పలికారు.ముందుగా జగన్ వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి.. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్లో అడుగుపెట్టారు.  


తొలి సారి సీఎం హోదాలో…
వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్లోని కుర్చీపై ఆసీనులయ్యారు. ముందుగా అయన ఆశా వర్కర్ల వేతనం పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు సీఎం వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారు. 
Previous Post Next Post