వనపర్తి జూన్ 8 (way2newstv.com)
తెలంగాణ ఆర్టీసీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈనెల 11 న ఛలో బస్ భవన్ కార్యక్రమాన్ని కి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ఆర్టీసిలో పనిచేస్తున్న కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వనపర్తి డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు కోరారు.
ఛలో బస్ భవన్
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పే స్కేల్ వెంటనే అమలు, కొత్త నియామకాలు, కాలం చెల్లిన బస్సుల తొలగింపు, కొత్త బస్సుల కొనుగోలు, పని భారం తగ్గింపు తదితర డిమాండ్లపై బస్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగినదని వారు అన్నారు. కార్మికవర్గం అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
Tags:
News