మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌కు బయల్దేరి వెళ్లారు. 19 నుంచి ఈ నెల 24 వరకు నారావారి ఫ్యామిలీ ట్రిప్‌ను ఎంజాయ్ చేయనుంది. యూరప్ పర్యటన కారణంతోనే చంద్రబాబు ఢిల్లీలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌కు వెళ్లలేకపోయారట. ముందుగానే నిర్ణయించుకున్న పర్యటను కాబట్టి.. వాయిదా వేసుకోలేకపోయారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఓసారి ట్రిప్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఐరోపా టూర్ లో చంద్రబాబు
వాస్తవానికి చంద్రబాబు ఈ నెల 7 నుంచి 13 వరకూ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని భావించారు. అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ రావడం.. జూన్ 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పార్టీ నేతలత వరసగా భేటీలు చేపట్టాలని బాబు భావించారు. కానీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే సమీక్షలు నిర్వహించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, తర్వాత ఎన్నికల ప్రచారంతో చంద్రబాబు బిజీ అయ్యారు. కుటుంబంతో కూడా సరిగా గడపలేకపోయారు. ఎన్నికల తర్వాత కాస్త విరామం దొరకడంతో.. ఆయన హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. మళ్లీ ఇన్నాళ్లకు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి.