నీతి ఆయోగ్ సమావేశానికి కేసిఆర్ఎందుకు హాజరు కాలేదో ప్రజలకు చెప్పాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీతి ఆయోగ్ సమావేశానికి కేసిఆర్ఎందుకు హాజరు కాలేదో ప్రజలకు చెప్పాలి


మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ 
హైదరాబాద్,జూన్ 18 (way2newstv.com)
నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరు కాకపోవడం చాలా  విచారకర మని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ లో అభివృద్ధి బాగా జరుగుతుందని ప్రత్యేకించి సాగు నీటి ప్రాజెక్టులు, గ్రామీణ అభివృద్ధిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని గొప్పలుచెప్పుకొని ప్రచారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ విషయాలన్నీ నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా ప్రధాన మంత్రిని కోరివుంటే తెలంగాణ ప్రజలయొక్క అభిమానాన్ని ఇంకా ఎక్కువ  చూరగొనేవాడని పేర్కొన్నారు.  


నీతి ఆయోగ్ సమావేశానికి కేసిఆర్ఎందుకు హాజరు కాలేదో ప్రజలకు చెప్పాలి 
ఇది రాజకీయ సమావేశం కాదని ఇలాంటి సమావేశం లో మంచి అవకాశాన్ని కోల్పోయాడన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో "టీం ఇండియా" స్ఫూర్తి తో ప్రధాన మంత్రి గారు నిర్వహించిన అధికారిక సమావేశం.   ఇంత ప్రాముఖ్యం ఉన్న సమావేశానికి ముఖ్యమంత్రి  శ్రీ కెసిఆర్ ఎందుకు గైరుహాజర్ అయ్యారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేసారు.ఈ  నెల 19 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు నిర్వహించనున్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో దేశంలో అనేక మార్పులు చేసేందుకు, క్రొత్త  క్రొత్త సంస్కరణలతో పేద బడుగు బలహీనవర్గాల వారికి మేలు చేసేలా క్రొత్త కార్యాచణనను రూపొందిచనున్నారని, దీనిలో భాగంగా  ఒకే దేశం ఒకే ఎన్నికలు అలాగే గ్రామీణ ప్రాంతాలు మరియు వెనుకబడిన ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి తదితర అనేకమైన సమస్యలను మరియు మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాల ఏర్పాట్లు   ఆ సమావేశంలో చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున కనీసం ఈ సమావేశానికైనా ముఖ్యమంత్రి కె సిఆర్ తప్పకుండా హాజరు అవుతారన్న ఆశ భావాన్ని దత్తాత్రేయ వ్యక్తం చేసారు.