జెయింట్ కిల్లర్ కు ఆమాత్య పదవి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జెయింట్ కిల్లర్ కు ఆమాత్య పదవి

ఏలూరు, జూన్ 6, (way2newstv.com)

ఆయ‌న దాదాపుగా రాజ‌కీయంగా అస్త్ర స‌న్యాసం చేసేశారు. ఎవ‌రికీ కూడా ఆయ‌న‌పై పెద్ద‌గా ఆశ‌లు లేవు. పైగా వ‌య‌సు రీత్యా కూడా ఆయ‌న పెద్ద‌వారైపోయారు. ముఖ్యంగా ఆయ‌న పదవిలో ఉన్న రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్‌లోనూ ఆయ‌న‌ను మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే, అంద‌రూ అనుకున్న‌ట్టుగా కాకుండా ఒక్క‌సారిగా ఆయ‌న విజృంభించారు. త‌న స‌త్తా ఏంటో చూపించారు. బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ.. త‌న రాజ‌కీయ వ్యూహానికి ప‌దును పెట్టి మ‌రీ.. త‌నేంటో నిరూపించుకున్నారు. ఆయ‌నే.. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కిన చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు.క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన చెరుకువాడ‌.. ఏమాత్రం క్ష‌త్రియ వ‌ర్గం హ‌వా లేని ఆచంట నుంచి అనూహ్యంగా విజయాన్ని కైవ‌సం చేసుకుని రికార్డు సృష్టించారు. దీంతో ఆయ‌న గ‌త చ‌రిత్ర గురించి ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నా రు. 2004లో కాంగ్రెస్ నుంచి ప్రారంభ‌మైన చెరుకువాడ రాజ‌కీయ ప్ర‌స్థానం వైఎస్ ఆశీర్వాదంతో అత్తిలి నియోజ‌క‌వర్గం  పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు. 


జెయింట్ కిల్లర్ కు ఆమాత్య పదవి
ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న అప్ప‌టి మంత్రి దండు శివ‌రామ‌రాజును ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా అసెంబ్లీలో అడుగుపెట్టారు. త‌ర్వాత 2009లో అత్తిలి ర‌ద్ద‌యి.. దాని స్థానంలో ఆచంట నియ‌జ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. ఇక‌, ఇక్క‌డ వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీద ఉన్నారు మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌.ఇక పితాని ఇప్ప‌టికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజ‌యాలు సాధించారు. ఈ సారి పితానిని ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న చెరుకువాడ‌.. న‌ర‌సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ గ‌ట్టి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఎంపీగా అయితే.. విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు చెరుకువాడ‌. అయితే, పితానిని టార్గెట్ చేసుకున్న జ‌గ‌న్‌.. చెరుకువాడ కోరిక‌ను ప‌క్క‌న పెట్టి.. నేరుగా ఆయ‌న‌ను ఆచంట నుంచి రంగంలోకి దింపారు.ఇక్క‌డ క్ష‌త్రియ వ‌ర్గం మైనార్టీ అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగం ఫ‌లించింది. జ‌గ‌న్ ఇక్క‌డ 2014 ఎన్నిక‌ల్లోనూ ఇదే సామాజిక‌వ‌ర్గానికి చెదిన ముదునూరు ప్ర‌సాద‌రాజు ను రంగంలోకి దించారు. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌సాద‌రాజు పితానికి గ‌ట్టి పోటీ ఇచ్చి 2800 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు వ‌రుస‌గా మ‌రోసారి విజ‌యం సాధించాల‌ని అనుకున్న పితాని హ‌వాకు చెరుకువాడ అడ్డుక‌ట్ట వేసి తాను విజ‌యం సాధించారు. దీంతో అంద‌రూ మ‌రిచిపోయిన‌ట్టు భావించే చెరుకువాడ బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ..త‌న హ‌వాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏదేమైనా .. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌రుగుతుంద‌ని చెప్ప‌డానికి ఇది చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌.