తిరుపతిలో లాభాల పంట పండిస్తున్న నర్సరీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుపతిలో లాభాల పంట పండిస్తున్న నర్సరీలు


తిరుపతి, జూన్ 6  (way2newstv.com)
పచ్చని చెట్లు ఇంటి అందాన్ని పెంచుతాయి. నర్సరీలు యజమానులుకు లాభాలు పండిస్తున్నాయి.  అంతేకాదు ఇంటిలో ఉన్నవారికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతాయంటున్నారు నిపుణులు. అందుకే నగర వారసులు తమ ఇళ్లలో కృత్రిమ రంగులు, రసాయనాలతో కూడిన డిజైన్ల కంటే కొద్దిపాటి ఆవరణలో పచ్చటి మొక్కల పెంపకానికే ఆశక్తి చూపుతున్నారు. మొక్కల పెంపక విషయంలో నర్సరీలు నిర్వహించే నిపుణుల సలహాలను జాగ్రత్తలను పాటిస్తూ, అందంతోపాటు ఆహ్లాదాన్ని సొంతం చేసుకునేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఎస్‌వియు, ఎయిర్‌ బైపాస్‌రోడ్డు, రేణిగుంటరోడ్డు, తిరుమల బైపాస్‌ రోడ్డు, శిల్పారామంతోపాటు మరికొన్ని ముఖ్యప్రాంతాల రోడ్లుపక్కన నర్సరీలు వెలుస్తున్నాయి. 


తిరుపతిలో  లాభాల పంట  పండిస్తున్న నర్సరీలు
ఇక్కడున్న మొక్కల పచ్చదనాన్ని చూసి ముచ్చటపడుతున్న నగరవాసులు వాటిని కొనుగోలు చేయడానికి ఆశక్తి చూపుతున్నారు. దీంతో నర్సరీల వద్ద అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. అందుకే వర్షాలు మొదలయ్యే లోపు ఇంటిలో పచ్చని మొక్కలు పెంచుకోవాలనుకునే వారికి నర్సరీ నిపుణుల పలు సూచనలు చేస్తున్నారు.మొక్కలు నాటేందుకు ప్లాస్టిక్‌ కుండీలు కన్నా మట్టి, సిమెంట్‌తో చేసిన కుండీలు మంచిదని నర్సరీ నిపుణులు చెబుతున్నారు. మొక్కలు నాటే ముందు ఐదు భాగాల ఎర్రమట్టి, మూడు భాగాల పసువుల ఎరువు, లేదా వర్మి కంపోస్ట్‌లో కొద్దిగా గెమాగ్జిన్‌ పౌడర్‌, బొగ్గు, ఎండుఆకులు, రంపపు పొట్టు, సూపర్‌ పాస్పేట్‌ కలిపి ఈ మిశ్రమాన్ని కుండాల్లో నింపి మొక్కలు నాటాలి. కొన్ని రోజుల తరువాత కుండీల్లో భారీగా పెరిగిన మొక్కలను మట్టితో సహా తీసి నేలలో నాటుకోవచ్చు. మొక్కల పొదల్లో తేమను గమనించి నీరుపోస్తూ మొక్కలను రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చదనంతో ఉండే ఏ మొక్కనైనా ఇంటి అందాన్ని పెంచుతుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడమేకాకుండా ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండేందుకు మొక్కలు ఎంతో దోహదపడతాయి. మొక్కల్లో ఎన్నో రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. టేబుల్‌ఫాం, రాబిక్‌, ఆర్కెఫాం, దస్తూరి, అంజీర, క్రిస్మస్‌ ట్రీ, గులాబి, లిల్లీ, అశ్వగంధ, చామంతి, పైకస్‌, నాక్సెమల్లె, తదితర మొక్కలను కుండీల్లో ఇంటి ఆవరణలో నాటు కోవచ్చు. కానీ, ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలను వేరే స్థలానికి తీసుకెళ్లలేం. కాబట్టి తరలించేందుకు వీలుగా ఈ మొక్కలను కుండీల్లో నాటుకుంటేనే సౌకర్యంగా ఉంటుంది.