బీళ్లుగా భూములు (ప.గో జిల్లా)

పోలవరం, జూన్ 15 (way2newstv.com):

వేసవి ముగియనుంది. తొలకరి పలకరిస్తోంది. అయినా.. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ కనీసం మాగాణి భూముల్లో కూడా అరక సాలు వేసిన దాఖలాలు లేవు. కారణం.. పోలవరం ముంపు భూములు కావడమే. భూసేకరణలో భూములకు పరిహారం ఇచ్చారు కానీ ఆర్‌అండ్‌ఆర్‌ అందలేదు. నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించలేదు. మొత్తం పరిహారం ఇచ్చి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే వరకూ భూములను నిర్వాసిత రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం పునరావాస కాలనీలకు తరలించే వరకూ సంబంధిత నిర్వాసిత రైతాంగానికే ఆ భూములపై హక్కు ఉంటుంది. 


బీళ్లుగా భూములు (ప.గో జిల్లా)
ఇటీవల కొందరు భూములు ప్రభుత్వానివి కనుక గిరిజనులు సాగు చేసుకుంటారని ఆదివాసీలు జెండాలు పాతుతున్నారు. దీంతో రైతులు కలవరం చెందుతున్నారు.సొంత భూములున్న రైతులు సాగుకు ఉపక్రమిస్తుంటే, పూర్తిగా కౌలు ఆధారమైన రైతాంగం మాత్రం భూములను ఏమీ చేసుకోవాలో అర్ధం కావటం లేదంటున్నారు. గత ఏడాది వరకూ ఎకరా భూమిపై రూ.25 వేలు వరకూ కౌలు వచ్చేది. ఈ ఏడాది కౌలుకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. కనీసం ఎకరా రూ.10 వేలకు అయినా ఇద్దామన్నా.. ఏ రైతు అడిగిన పాపాన పోవటం లేదు.రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మిరప పంట సాగులో ఉన్నా కుక్కునూరు మిర్చికి ఉన్న గిరాకీ వేరు. గుంటూరు మార్కెట్లో కుక్కునూరు మిరప అంటే వ్యాపారులకు ఆసక్తి. ఇక్కడ సారవంతమైన నల్లరేగడి భూముల్లో పండే ఈ పంట నాణ్యత బాగుంటుంది. దీంతో వ్యాపారులు కూడా రూపాయి అయినా అధికం ఇచ్చి దక్కించుకుంటారు. బహుళజాతి సంస్థ ఐటీసీ అగ్రి డివిజన్‌ అధికారులు ఈ మండలంలో ప్రత్యేకంగా రైతులను ఎంపిక చేసుకుని మిర్చి సాగును చేస్తోంది. అటువంటి అరుదైన మిర్చి ఇక కనపడకపోవచ్ఛు
Previous Post Next Post