తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన


హైదరాబద్ జూన్ 1 (way2newstv.com):
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం ప్రభావంతో ఈదురుగాలుల వీస్తాయని పేర్కొంది.


తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తర కర్ణాటక వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలహీనంగా మారిందని వాతావరణ శాఖ వివరించింది. అటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Previous Post Next Post