అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
పలు ఇళ్లల్లో పోలీసుల సోదాలు
మంత్రాలయం జూన్ 1, (way2newstv.com)
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని సూగూరు గ్రామంలో సీఐ రవీంద్ర ఆధ్వర్యంలో మంత్రాలయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు బీసీకాలనీ , ఎస్సీ కాలనీ పాత ఊరు కాలనీలో ప్రత్యేక బృందం పోలీసులతో కవాతు నిర్వహించారు. పలు పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
సూగూరు గ్రామంలో కార్డన్ సెర్చ్
ఈ సందర్భంగా సీఐ.రవీంద్ర మాట్లాడుతూ గ్రామంలో గొడవలు ప్రేరేపించినా ,అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎటువంటి మారణ ఆయుధాలు కలిగి ఉన్న కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని కోరారు. ఏవిషయం అయినా లేదా ఎటువంటి సంఘటనజరిగినా ముందుగా పోలీసులకు తెలియచేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో మాధవరం ఎస్ జగన్నాథం మంత్రాలయం ఏఎస్ఐ శివలింగం, గోవిందరాజులు,ఆంజనేయులు, భాస్కర్ నాయుడు ,ఈరన్న, కానిస్టేబుల్ రాముడు, జయన్న స్పెషల్ పార్టీ పోలీసులు దాదాపు 30 మంది పోలీసులు పాల్గొన్నారు.
Tags:
News