దిగొస్తున్న కూరల ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిగొస్తున్న కూరల ధరలు


విశాఖపట్టణం, జూన్ 25, (way2newstv.com)
విశాఖ నగరంలోని రైతు బజార్లలో గత వారంతో పోలిస్తే ఈ వారం కూరగాయల ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. కొన్నింటి ధరలు కాస్త పెరగ్గా, మరికొన్నింటి ధరలు తగ్గాయి. ముఖ్యంగా అన్ని కూరలలో విధిగా వినియోగించే టమాటా ధర బాగా తగ్గింది. గత వారం దేశవాళీ టమాటా ధర కిలో రూ.40 ఉండగా ఈ వారం రూ.28కి తగ్గింది. బెంగళూరు టమాటా ధర రూ.35 నుంచి రూ.24కి తగ్గింది. బెండకాయలు రూ.30 నుంచి రూ.28కి, బీన్స్‌ రూ.80 నుంచి రూ.64కి, చేమ దుంపలు రూ.26 నుంచి రూ.24కి, బంగాళా దుంపలు రూ.14 నుంచి రూ.13కి, మిర్చి (తెలుపు) రూ.54 నుంచి రూ.50కి, పొటల్స్‌ రూ.26 నుంచి రూ.22కి, బీన్స్‌ పిక్కలు రూ.50 నుంచి రూ.40కి కీరదోస రూ.22 నుంచి రూ.18కి తగ్గాయి. 



దిగొస్తున్న కూరల ధరలు
ధరలు పెరిగిన వాటిలో కాకర కాయలు ఉన్నాయి. వీటి ధర రూ.34 నుంచి రూ.38కి పెరిగింది. నల్ల వంకాయలు రూ.56 నుంచి రూ.58కి, క్యారెట్‌ రూ.24 నుంచి రూ.26కి, బీట్‌రూట్‌ రూ.24 నుంచి రూ.28కి, గోరుచిక్కుడు రూ.24 నుంచి రూ.26కి, క్యాప్సికం రూ.40 నుంచి రూ.48కి, కర్రపెండలం రూ.18 నుంచి రూ.20కి, చిలగడ దుంపలు రూ.24 నుంచి రూ.26కి, ఆనపకాయ రూ.18 నుంచి రూ.22కి, అరటికాయలు పెద్దది రూ.5 నుంచి రూ.7కి, చిన్నది రూ.3 నుంచి రూ.5కి, ముల్లంగి రూ.22 నుంచి రూ.26కి, దోసకాయ రూ.18 నుంచి రూ.22కి, మునక్కాడలు రూ.22 నుంచి రూ.36కి పెరిగాయి.ధరలో మార్పులేని వాటిలో అల్లం (పాతది) రూ.145, కొత్తది రూ.105, బీరకాయలు రూ.22, ఉల్లిపాయలు (మహారాష్ట్ర) రూ.20, దేశవాళి రూ.15, వెల్లంకి వంకాయలు రూ.30, ఆగాకరకాయలు రూ.44, దొండకాయలు రూ.22, చిక్కుడు కాయలు రూ.54, బరబాటి రూ.48, కాలీఫ్లవర్‌ రూ.30, పచ్చి బఠాణి రూ.54, వెల్లుల్లి రూ.80, చిన్న రకం రూ.70గా ఉన్నాయి. డజను గుడ్లు ధర రూ.52 నుంచి రూ.54కి పెరిగింది.