విజయవాడ: సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెరాష వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్, కర్ణే ప్రభాకర్, తదితరులు విజయవాడ కనకదుర్గ ఆలయాంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఇంద్రకీలాద్రిలో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ బృందానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పంచాయతిరాజ్ మంత్రి ద్ది రెడ్డి రామ చంద్ర రెడ్డి, చంద్రగిరి శాసన సభ్యులు చెవి రెడ్డి భాస్కర రెడ్డిలు స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం కార్యనిర్వహణాధికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ,. ఆలయ ప్రధాన అర్చకులు అయనకు స్వాగతం పలికినారు. అమ్మవారి దర్శనానంతరాo అమ్మవారి ప్రసాదాలను చిత్రపటమును తెలంగాణ ముఖ్యమంత్రి కి అధికారులు బహుకరించారు.