కొలువు తీరిన 20 జెడ్పీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొలువు తీరిన 20 జెడ్పీలు


హైద్రాబాద్. జూలై 5 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల సంఖ్య 32కి పెరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. దీంతో జిల్లా పరిషత్‌ల సంఖ్య 32కి చేరింది. కొత్తగా ఏర్పడిన 23 జిల్లా పరిషత్‌ల్లో 20 శుక్రవారం ప్రారంభం కానుండగా.. మరో మూడు జడ్పీలు ఆగస్టు 7న ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం జడ్పీలకు నిధులు భారీగా ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వాటికి పూర్వవైభవం వస్తుందని కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొలువు తీరిన 20  జెడ్పీలు

గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలకు జడ్పీలు ఉండేవి. జిల్లాల విభజనలో వాటి సంఖ్య 32కి చేరింది. వాటి పదవీకాలం తాజాగా ముగియడంతో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఖమ్మం జడ్పీకి పదవీ కాలం ఇంకా ముగియకపోవడంతో అక్కడ కొత్త పాలకవర్గం మరికొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది. ఇవాళ 20 జడ్పీలు శుక్రవారం తొలి సమావేశం నిర్వహించడంతో ఆయా జిల్లాల్లో అధికారికంగా అవతరించాయి.. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు జిల్లా పరిషత్‌లు ఆగస్టు 7న ప్రారంభం కానున్నాయి. అన్ని జడ్పీల్లోనూ సీఈవో, ఏవో పోస్టులను ఏర్పాటుచేసిన ప్రభుత్వం అర్హత కలిగిన అధికారులను ఇప్పటికే అక్కడికి బదిలీ చేసింది.