హైదరాబాద్,జూలై 25 (way2newstv.com)
పాతబస్తి లో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ ,కళాశాలను ఎర్రగడ్డ తరలిస్తున్నారు...తరలించవద్దు అని బీజేపీ పార్టీ తరుపున మంత్రి ఈటల ను కోరామని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.
అయుర్వేద కళాశాలను తరలించవద్దు
ఎన్నో సంవత్సరాల నుంచి హాస్పిటల్ కి చికిత్స కోసం వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదీక్ ,హోమియో, ఆయుష్ కి నిధులు ఇస్తుంది. కేంద్రం తెలంగాణ కి భారీగా నిధులు ఇస్తున్నారు.. 32 జిల్లా కేంద్రాలలో ఆయుష్ హాస్పిటల్స్ ని నిర్మించాలని కోరుతున్నామని అయన అన్నారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయం లో సికింద్రాబాద్ లో ఆయుష్ హాస్పిటల్ ని మంజూరు చేపించాను. 58 కోట్ల రూపాయల నిధులు ఉన్నవి..వాటిని ఖర్చు చేయాలని కోరుతున్నామని దత్తాత్రేయ అన్నారు.