నిలకడగా పెట్రో ఉత్పత్తుల ధరలు

ముంబై, జూలై 25(way2newstv.com):
దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.77.96 వద్ద, డీజిల్ ధర రూ.72.14 వద్ద స్థిరంగా కొనసాగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.77.64 వద్ద నిలకడగా ఉంది. డీజిల్‌ ధర కూడా స్థిరంగా రూ.71.49 వద్ద కొనసాగుతోంది. 
నిలకడగా పెట్రో ఉత్పత్తుల ధరలు

ఇక విజయవాడలోనూ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.77.29 వద్ద, డీజిల్ ధర రూ.71.17 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.73.41 వద్దనే ఉంది. డీజిల్ ధరలోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.66.24 వద్ద ఉంది. వాణిజ్య రాజధానిముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.79.02 వద్ద, డీజిల్ ధర రూ.69.43 వద్ద నిలకడగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు  ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.16 శాతం పెరుగుదలతో 63.28 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.29 శాతం పెరుగుదలతో 56.04 డాలర్లకు ఎగసింది.
Previous Post Next Post