విజయవాడ, జూలై 17, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా బిశ్వభూషన్ హరిచందన్ నియమితులయ్యారు. అయితే, రాజధాని కేంద్రంగా ఆయన పాలన సాగించడానికి మాత్రం రాజ్‌భవన్ లేదు. రాష్ట్ర విభజన జరిగాక తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నివాసం ఉంటున్న ఆయన.. అవసరం వచ్చినప్పుడల్లా తాత్కాలిక బస ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్లి వచ్చేవారు. దీంతో రాజ్‌భవన్ అవసరం అంతగా లేకపోయింది. సచివాలయం, అసెంబ్లీని నిర్మించిన ఏపీ ప్రభుత్వం రాజ్‌భవన్‌ను మాత్రం నిర్మించలేదు. అయితే, ఇప్పుడు ఏపీకి కూడా కొత్తగా గవర్నర్ నియామకం కావడంతో రాజ్‌భవన్ ఎలా అన్న సమస్య ఎదురైంది.
సీఎం క్యాంప్ ఆఫీసే గవర్నర్ బంగ్లా
అయితే, ప్రస్తుతం విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికోసం సీఆర్డీయే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ పరిపాలనను ఏపీ నుండి సాగించాలనుకున్నప్పుడు అందుకు వీలుగా ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు అక్కడికి వెళ్లిపోయారు. ప్రస్తుత సీఎం జగన్‌మోహన్ రెడ్డి తన ఇంటి నుంచే పాలన సాగిస్తున్నందున సీఎం క్యాంపు కార్యాలయం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని గవర్నర్ తాత్కాలిక నివాసంగా మార్చుతున్నారు. మరోవైపు, నవ్యాంధ్రలో గవర్నర్ శాశ్వత నివాసం, కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసరేషన్ కమల్ షురూ..ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ వచ్చేశారు. బిశ్వభూషణ్ హరి చందన్‌ను కొత్త గవర్నర్‌గా నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వ భూషణ్ ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత. మరోవైపు హరిచందన్‌తో పాటూ చత్తీస్‌గడ్‌కు గవర్నర్‌ను నియమించారు. ఆ రాష్ట్రానికి అనసూయ ఊకిని నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. హరిచందన్ ఒడిశా బీజేపీ సీనియర్ నేత. 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరిన ఆయన.. 1988లో బీజేపీ గూటికి వెళ్లారు. తర్వాత భువనేశ్వర్ నుంచి ఎంపీగా గెలిచి.. 1980నుంచి 1988 వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. సిలికా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా పనిచేశారు. హరిచందన్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.. రచయితగా పలు పుస్తకాలను రచించారు. హరి చందన్ నియామకంతో.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతారు. నరసింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి గవర్నర్‌గా ఉంటున్నారు. విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు గవర్నర్‌ను మారుస్తారని ప్రచారం జరిగినా.. మార్చలేదు. ఇప్పుడు బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు జరిగింది.
Tags:
Andrapradeshnews