ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలి


- సిద్ధిపేటలో 70 నుంచి 80 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరగాలి
- జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు 
- జిల్లా ఏరియా ఆసుపత్రి, మెడికల్ కళాశాల వైద్య ఆరోగ్య వర్గాలకు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు సూచనలు 
సిద్ధిపేట, జూలై 06 (way2newstv.com
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని., ప్రస్తుతం ఉన్న స్పెషలైజేషన్ వైద్యులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలని వైద్యులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలని, ముఖ్యంగా సిద్ధిపేటలో 70 నుంచి 80 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరగాలని వైద్య వర్గాలకు సూచించారు.


 ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలి


జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశిస్తూ.. ఆర్ఎంఓ, మెడికల్ డైరెక్టర్, సూపరిండెంట్ సమన్వయంతో కలిసి సమిష్టిగా పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య వర్గాలను రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల పని తీరు, పలు సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల దృష్టికి తీసుకొచ్చారు. అంశాల వారీగా.. - సిద్ధిపేటలో 70 నుంచి 80 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరగాలి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాదికి నార్మల్ డెలివరీ సంఖ్య తగ్గడం, ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా అవుతున్నాయని, దీనిపై వైద్యుల్లో నియంత్రణ లోపం స్పష్టంగా కనపడుతున్నదని వైద్యాధికారుల తీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్మల్ డెలివరీలు జరగక పోవడం వల్ల ప్రజల ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, ఈ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా రోగులకు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ తో పాటు అప్పుడప్పుడు వైద్యాధికారులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల వసతులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల కేసులను ప్రైవేటుకు, హైదరాబాదుకు రెఫర్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి ఈటెలకు వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకతను వివరించారు. పలు సందర్భాల్లో వైద్యులు పని భారం తమ మీద పడుతుందని హైదరాబాదు గాంధీకి రెఫర్ చేస్తున్నారని, ఈ విషయంలో రెఫరల్ విధానాన్ని పరిశీలించి అవసరమైన రెఫరల్స్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సమీక్షలో తెలిపారు. ఆరోగ్య శ్రీ సేవలు మరింత పెరగాలని.. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు 150 నుంచి 200 ఆర్థోపెడిక్ కేసులు ఆరోగ్య శ్రీలో నమోదయ్యేవని, కానీ ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చాక ఆరోగ్య శ్రీలో ఆర్థోపెడిక్ కేసులు నమోదు కాకపోవడంలో ఆంతర్యమేంటనీ వైద్య వర్గాలను ఆరా తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమెర్జెన్సీ సమయంలో 108 వాహనాల ద్వారా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళుతున్నారని, నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై అత్యంత విశ్వాసం పెరిగేలా కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకం, ఉచిత భోజనం ఏర్పాట్లు చేస్తున్నా, డెలివరీల సంఖ్య పెరగకపోవడం పై కారణాలు చెప్పాలని వైద్యులను ప్రశ్నించారు. ఈ విషయమై వైద్యాధికారులు స్పష్టత ఇవ్వకపోగా సాకులు చెప్పడం అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ గారి అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని., 20 మంది స్టాఫ్ నర్సుల తొలగింపు పై వైద్యాధికారుల పై అగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా సీఎం స్వగ్రామం చింతమడక గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మర్కూక్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమించాలని మంత్రి ఈటెలను కోరారు. అలాగే జేఎస్కే పేమెంట్స్ నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సమీక్షలో డీఎంహెచ్ఓ అమర్ సింగ్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రయ్య, ఇతర వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.