గాంధీ, ఉస్మానియా తరహాలో.. సిద్ధిపేట వైద్య కళాశాలకు పేరోస్తది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గాంధీ, ఉస్మానియా తరహాలో.. సిద్ధిపేట వైద్య కళాశాలకు పేరోస్తది


- కళాశాల, ఆసుపత్రి పురోగమించేలా చర్యలు చేపడుతాం
- జిల్లా ఏరియా ఆసుపత్రి, మెడికల్ కళాశాల సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి
సిద్ధిపేట, జూలై 06 (way2news.com
రానున్న కాలంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల తరహాలో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలకు పేరోస్తదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మెడికల్ కళాశాల-ప్రభుత్వ దవాఖానా కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డిలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో సమీక్షా సమావేశం జరిపారు. 


గాంధీ, ఉస్మానియా తరహాలో..
సిద్ధిపేట వైద్య కళాశాలకు పేరోస్తది



ఈ సమీక్షలో డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ ఐడీసీ-ఎండీ చంద్రశేఖర్, సీఈ లోకేశ్వర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓఎస్డీ డాక్టర్ గంగాదార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ అశోక్ కుమార్, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, డీఎంహెచ్ఓ అమర్ సింగ్, సిద్ధిపేట, గజ్వేల్ సూపరిండెంట్స్ కృష్ణారావులు, జిల్లాలోని వైద్య శాఖ అధికారిక బృందం మెడికల్ కళాశాల, దవాఖానాతో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాల పురోగమించేలా చర్యలు చేపడుతామని చెప్పారు. రానున్న కాలంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల తరహాలో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలకు పేరోస్తదని ధీమాగా చెబుతున్నానని తెలిపారు. సిద్ధిపేట వైద్య కళాశాల, ఆసుపత్రి పై మాజీ మంత్రి హరీశ్ రావు కోరిన అవసరాలు, సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. యుద్ధ ప్రాతిపాదికన రెగ్యులర్ అవసరాలు ఏవైతే ఉన్నాయో.. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రోజు వారీగా వైద్య ఆరోగ్య శాఖ పై భారం పెరుగుతూనే వస్తుందని, అన్ని శాఖల కంటే వైద్య ఆరోగ్య శాఖ భిన్నమని వివరిస్తూ.. వైద్య శాఖలో ఉన్న వివిధ విభాగాల ఉద్యోగులు సఖ్యతగా ఉండాలని, సమన్వయంగా కలిసి పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సఖ్యతగా ఉంటూనే సమస్యలు ఉత్పన్నం కాకుండ చూసుకోవాల్సిన బాధ్యత ఆయా వైద్య శాఖలోని విభాగాల అధికారులదేనని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలోనే గడువు ముగిసిన మందుల విషయమై గడువు ముగియక ముందే పసి గట్టేలా వైద్య రంగంలో పెను మార్పులు తెచ్చామని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా చోట్ల వైద్య సిబ్బంది కొరత ఉన్నదనేది వాస్తవమని., ఇందుకుగానూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డును నియమించినట్లు, తొందరలోనే నియామకాల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.