కొల్లాపూర్ లో నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక మహబూబ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను ప్రతి కార్యకర్త ముందుండి సభ్యత్వ నమోదు చేయించాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు.
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా సభ్యత్వ నమోదు చేయాలి
ముఖ్యమంత్రి ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టారు. ప్రతి సభ్యత్వానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత మన సీఎం కేసీఆర్ దని ఆయన అన్నారు. కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కొరకు సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కాబోతుందని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కొరకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,జెడ్పీటీసీలు, ఎంపీపీలు ,సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Tags:
telangananews