శ్రీ మఠంలో సినీప్రముఖులు

మంత్రాలయం, జూలై 26  (way2newstv.com)
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శించుకోవడానికి సినీ ప్రముఖులు మంత్రాలయం వచ్చారు. నేపథ్య గాయకుడు మనో   (నాగూర్ బాబు ) ఆయన సతీమణి, కుమారుడు సంగీత దర్శకుడు గురుకిరణ్ శుక్రవారం మంత్రాలయం చేరుకున్నారు. శ్రీ మఠం అధికారులు వీరికి స్వాగతం పలికారు.
శ్రీ మఠంలో సినీప్రముఖులు

వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, అనంతరం రాఘవేంద్రస్వామి మూల  బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు వీరికి శేష వస్త్రం ఫలమంత్ర అక్షంతలు ఇచ్చి  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మఠం పిఆర్ఓ. వ్యాసరాజ ఆచార్  తదితరులు ఉన్నారు.
Previous Post Next Post