చంద్రయాన్ ప్రయోగాన్ని పరిశీలించనున్న రాష్ట్రపతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రయాన్ ప్రయోగాన్ని పరిశీలించనున్న రాష్ట్రపతి

తిరుమల, జూలై 12(way2newstv.com)
యావత్ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జలై-15,2019 తెల్లవారుజామున 2:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపనున్నారు.ఆదివారంఉదయం 6:51గంటల నుంచి దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.
చంద్రయాన్ ప్రయోగాన్ని పరిశీలించనున్న రాష్ట్రపతి

అయితే శుక్రవారంలాంచింగ్ రిహార్సల్ జరుగుతుంది.ఈ ప్రయోగానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు.అర్ధరాత్రి తర్వాత ప్రయోగం చేపట్టనుండడంతో జులై- 14వ తేదీ షార్‌కు రాష్ట్రపతి రానున్నారు. నాలుగు రోజుల తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా  ఇవాళ చెన్నై చేరుకుంటారు రాష్ట్రపతి కోవింద్.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాంచీపురం చేరుకుని వరదరాజ పెరుమాల్ ఆలయంలో అథి వరదార్ స్వామి దర్శనం చేసుకుంటారు.శనివారంరాత్రికి తిరుపతి చేరుకుంటారు.భారీ భద్రత నడుమ రోడ్డు మార్గం ద్వారా తిరుమలకి చేరుకుంటారు.శనివారం రాత్రి తిరుమలలోనే బస చేసి ఆదివారంఉదయం వెంకటేశ్వరస్వామి దర్శం చేసుకుంటారు.అనతంరం శ్రీహరికోటకు వెళతారు.చంద్రయాన్-2 ప్రయోగకార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగ తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరతారు.