పంట రుణాలు మాఫీ దిశగా అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంట రుణాలు మాఫీ దిశగా అడుగులు

వరంగల్, జూలై 19, (way2newstv.com)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్ష లోపు ఉన్న పంట రుణాలు మాఫీ చేసేందుకు టిఆర్‌ఎస్ సర్కార్ దృష్టి సారించింది. వచ్చే నెలలోనే మాఫీకి సంబంధించి న విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రుణాలు రెన్యువల్ చే సుకోవాలనే రైతులు మాఫీ ఆశతో బ్యాంకుల వైపు చూ డటం లేదు. దీంతో వీలైనంత త్వరగా మార్గదర్శకాలు రూపొందించి మొదటి దశ కింద కొంత మొత్తం జమ చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న రూ. లక్ష లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఇప్పటికే సిఎం కెసిఆర్ ప్రకటించారు. దీంతో నేరుగా ఆర్థిక శాఖ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సంప్రదించి ఏ ఏడాదిలో ఎక్కువ పంటరు ణాలు తీసుకున్నారు.. ఏయే సీజన్‌లలో రూ. లక్షలో పు ఉన్న రుణాల మొత్తం, రైతుల సంఖ్యను ప్రాథమికం గా తెప్పించుకుంది. 
పంట రుణాలు మాఫీ దిశగా అడుగులు

వీటికి అనుగుణంగా అమలు మార్గదర్శకాలు, విధి విధానాలను తయారు చేస్తున్నారు.కటాఫ్ తేదీ ప్రకటించినప్పటికీ, ఎప్పడి నుంచి (ఏ సీజన్) రుణాల నుంచి పరిగణనలోకి తీసుకుంటారనే దానిపైనే తర్జన భర్జన కొనసాగుతోంది.కుటుంబంలో ఒక్క రైతుకే వర్తింపజేయడం, బంగారం తాకట్టు పెట్టి తీసుకుంటే మాఫీ ఇవ్వాలా వద్దా అనే విషయాలపై లోతుగా చర్చిస్తున్నారు. మరోవైపు రుణాలకు సంబంధించి బ్యాంకుల లెక్కలకు ,వ్యవసాయ శాఖ లెక్కలకు పొంతన లేకుండా పోతుంది. బ్యాంకులు మాత్రం రూ. 20 వేల కోట్లు రుణమాఫీకి సరిపోతాయని సర్కారుకు విన్నవించగా, వ్యవసాయ వర్గాలు రూ. 26 వేల కోట్లు అవసరమని అంచనా వేశాయి. బ్యాంకులైతే తమ అంచనాను ఆర్థికశాఖకు కూడా అందజేసినట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు ఏమేరకు సక్రమమైనవన్న దానిపై అధికారుల్లో పలు సందేహాలున్నాయి. బ్యాంకర్లు, వ్యవసాయశాఖ వర్గాలు మాత్రం గత రుణమాఫీ కింద చివరి విడత సొమ్ము చెల్లించిన నెల నుంచి పరిగణలోకి తీసుకుంటున్నాయి. 2017 సెప్టెంబర్ నాటికి గత రుణమాఫీ పూర్తిగా చెల్లించిన నెలగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.అప్పటి నుంచి 2018 డిసెంబర్ 11 వరకు లెక్కలోకి తీసుకున్నట్లు వారంటున్నారు.ఆ ప్రకారమే తాము రుణమాఫీకి అర్హులను, సొమ్మును అంచనా వేశామని అంటున్నారు. బ్యాంకర్లు చెరకు, పసుపు రైతులను పరిగణలోకి తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానివల్ల బ్యాంకర్లు తక్కువ సొమ్ము చూపారని వ్యవసాయ అధికారులు అంటున్నారు. తాము ఆ రైతులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అందుకే రూ. 26 వేల కోట్ల వరకు లెక్క తేలిందంటున్నారు. అయితే ఎప్పటినుంచి అమలు చేస్తారన్న తేదీ ఖరారు చేసి మార్గదర్శకాలు విడుదల చేశాకే రైతుల సంఖ్య, చెల్లించాల్సిన సొమ్ముపై స్పష్టత రానుంది.