భగవంతుని ఆశీస్సులు మీ దీవెనలతోనే ఈ స్థాయికి ఎదిగాను

ఆర్థిక మంత్రి బుగ్గన
బేతంచర్ల జూలై 13 (way2newstv.com
నా 25ఏళ్ల రాజకీయ జీవితంలో భగవంతుని ఆశీస్సులు మీ దీవెనలతో నేడు రాష్ట్రంలో అరుదైన మంత్రి పదవి అవకాశం దక్కిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి సారిగా శనివారం బేతంచర్ల  వచ్చేయడంతో నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు రాజధాని నుండి రైల్ లో వచ్చిన బుగ్గన మొదటగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొత్త బస్టాండ్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకొని  మండలంలోని వివిధ గ్రామాలనుండి తరలివచ్చిన అశేష జనవాహిని మధ్య ప్రజలకు అభినందనలు తెలుపుతూ ర్యాలీగా పాత బస్టాండ్ చేరుకున్నారు .
భగవంతుని ఆశీస్సులు మీ దీవెనలతోనే ఈ స్థాయికి ఎదిగాను 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో నాయకులు గత సంవత్సరాలుగా బేతంచర్ల ప్రజలను భయపెడుతూ ప్రయత్నించారు ఏ తప్పు చేయని మనము ఎవరికి  తలవంచలేదు ఎవరు ఎంత చులకనగా చూసిన మనం ఏమిటో వారికి చూపెడుతూనే ముందుకు వెళ్లాం ఇంక నుండి మండలంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించుకుందాం  బుగ్గన ప్రజలకు భరోసా ఇచ్చారు గ్రామాలలో రోడ్లు పట్టణానికి త్రాగునీరు ప్రధాన సమస్య  ఉన్నటువంటి పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పున ప్రారంభం బేతంచర్ల బైపాస్ రోడ్డు త్వరలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం మాద్రి ఉద్యోగ బదిలీలు రైతుల దిగుమతి తో పాటు మరుగుదొడ్లు కమిషన్ వసూలు చేసే విధానాన్ని చరమగీతం పాడి నిజాయితీ అయిన అవినీతి రహితమైన పాలన అందించడం జరుగుతుందన్నారు ఇప్పటివరకు దేశంలో ఎక్కడలేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో 80 శాతం అంశాలకు బడ్జెట్ కేటాయించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు 
Previous Post Next Post