రోజు రోజుకు అధ్వాన్నంగా మారుతున్న కౌలు రైతుల పరిస్థితులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోజు రోజుకు అధ్వాన్నంగా మారుతున్న కౌలు రైతుల పరిస్థితులు

నల్గొండ, జూలై 25, (way2newstv.com)
భూమినే నమ్ముకుని, దానిపైనే ఆధారపడి సాగుతో మమేకమయ్యే కౌలురైతు పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. ప్రస్తుతం ఆ రైతు గుర్తింపునకు నోచుకోక బలైపోతున్నాడు. కౌలు రైతుల్ని గుర్తించమని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అంటుంటే.. మరోవైపు వ్యవసాయం గిట్టుబాటు కావటంలేదు.ప్రకృతిపై ఆశ చావటంలేదు. లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడి పెడితే..ఖర్చులు పోను అన్నదాకు బాకీలే మిగులుతున్నాయి. చివరికి కంటికి రెప్పలా చూసుకున్న కాడెద్దులనూ భారంగా బహిరంగమార్కెట్లలో అమ్మకానికి తరలించక తప్పటంలేదువ్యవసాయం చేసే ప్రతి రైతుకు అండగా నిలుస్తామంటుంది రాష్ట్రప్రభుత్వం. వాస్తవానికి ఎక్కువ భాగం సాగు చేస్తున్నది కౌలు రైతులేనని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. దుక్కి దున్నటం మొదలుకుని ఎన్నో కష్టనష్టాల్లో కూరుకుపోతున్నారు. 
రోజు రోజుకు అధ్వాన్నంగా మారుతున్న కౌలు రైతుల పరిస్థితులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కౌలు రైతుల జీవనం యేటికేడూ దుర్భరంగా మారుతున్న తీరుపై 'నవతెలంగాణ' క్షేత్రస్థాయి పరిశీలనకు దిగింది. అందులో బోధన్‌ మండలం సాలూరాలో పర్యటించగా.. ఏ కౌలు రైతును కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఈ ఒక్క గ్రామంలోనే పదుల సంఖ్యలో రైతులు లక్షల్లో అప్పులుకావడం వారి దీనస్థితికి అద్దం పడుతున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 4,75,980 మంది రైతులున్నారు. అందులో నాల్గోవంతు కౌలు రైతులున్నారు. కౌలు రైతుల లెక్కలు అధికారుల వద్ద కూడా లేవు. అసలే భూమి లేనివారితో పాటు ఎకరం, రెండెకరాలు కలిగిన రైతులు కూడా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అందుకు యజమానికి ఎకరాకు దాదాపు 18-20 వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. బోధన్‌ మండలంలో గతేడాది ఎకరాకు రూ.17 వేలు కౌలు చెల్లించగా.. ఈ యేడాది ఏకంగా రూ.19 వేలు వసూలు చేస్తున్నారు. నీటి వసతి ఉంటే కౌలు రేటు మరింతపెరుగుతోంది. కొందరు భూ యజమానులు నీటి సౌలభ్యం ఉన్న భూములను సాగు చేసుకుంటూ నీటి వసతి లేని భూములను కౌలుకు ఇస్తున్నారు. బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌లలో నేరుగా కౌలు తాలూకు నగదు చెల్లిస్తుండగా.. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర డివిజన్లలో ఎకరాకు 10 క్వింటాళ్ల ధాన్యం చొప్పున యజమాని తీసుకుంటున్నాడు.గతేడాది వర్షాభావ పరిస్థితులు, కీలక సమయంలో బోర్లు వట్టిపోవడంతో కౌలు రైతులంతా అప్పులపాలయ్యారు. ఒక్కో రైతుకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు అప్పు మిగిలింది. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో అత్యధిక కౌలు చెల్లించిన రైతు.. పెట్టుబడి కోసం వరిసాగుకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేలు ఖర్చు పెడుతు న్నాడు. సాలూరాలో 60శాతంమంది సగటున మూడు నుంచి ఐదెకరాల వరకు కౌలు చేస్తున్నారు. ఐదెకరాల కౌలు పొలముంటే సగటున కౌలుకు రూ. లక్ష, పెట్టుబడికి మరో రూ.లక్షా 25వేలు ఖర్చవు తోంది. రబీ సీజన్‌లో ఈ విధంగా వేసిన వరిమొత్తం పోయింది. ఇతర పంటలు ఆశిం చిన మేర దిగుబడి సాధించకపోగా అప్పులే మిగిలా యి. ఈ గ్రామంలో సుభాష్‌ అనే రైతు తన రెండె కరాలు అమ్మి అప్పు తీర్చాడు. గంగారం గతేడాది కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి ప్రస్తుతం రెండు లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు. కౌలు వ్యవసా యంతో రెండు, మూడు సంవత్సరాల్లో వచ్చే లాభం కంటే ఒకే ఏడాదిలో వచ్చే నష్టమేఎక్కువని వాపోతు న్నాడు. మరో రైతు దత్తు నాలుగేండ్లుగా కౌలు చేసి అప్పుల పాలై పూర్తిగా కాడె వదిలేశాడు. కుటుంబ పోషణ కోసం గ్రామంలోనే టెంటుహౌస్‌ నడిపిసు ్తన్నాడు. బ్యాంకులు కౌలురైతులకు రుణాలివ్వకపోవ డంతో ప్రస్తుతం సాలూరాలో ఒక్కో కౌలురైతు రూ.2 నుంచి రూ.2.5చొప్పున ప్రయివేటుగా అప్పులు చేశారు