ఆర్బీఐ మార్గదర్శకాలను తుంగలో తొక్కిన బ్యాంకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్బీఐ మార్గదర్శకాలను తుంగలో తొక్కిన బ్యాంకులు


సిద్దిపేట, జూలై 06 (way2newstv.com):
రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు తుంగలో తొక్కిన బ్యాంకులు లక్షలాది తెలంగాణ రైతులు,నిరుద్యోగ యువత, చిన్న వ్యాపారస్తుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయని  తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు విమర్శించారు.  శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ భారంతో రైతాంగం ఆర్థికంగా దెబ్బతింటుందని వారికి ప్రైవేటు అప్పుల వడ్డీ భారం నుంచి రక్షించాలని అలాంటి రైతులకు మొదటి ప్రాధాన్యం తో రుణాలు ఇచ్చి ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించాలన్అనారు. అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2004 సంవత్సరంలో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.  అప్పుటి నుండి నేటి వరకు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో వేలాది మంది రైతులు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఒక్క బ్యాంకు కూడా తెలంగాణలో ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణం ఇచ్చే అవకాశం ఉన్నదని తెలుపలేదు.  

ఆర్బీఐ మార్గదర్శకాలను  తుంగలో తొక్కిన బ్యాంకులు

ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రైతులకు రుణాలు మంజూరు చేయలేదని అన్నారు. అంతేకాకుండా  దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు, యువతకు చిన్న వ్యాపారస్తులకు స్వయం ఉపాధి లో ప్రోత్సహించడానికి రూపాయలు 10 లక్షల వరకు ఏ ష్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి ముద్ర యోజన 08-04- 2015 న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 19 కోట్ల మందికి దేశ జనాభాలో  14 శాతం మందికి రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో బ్యాంకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా జిల్లా జనాభాలో ఒక శాతం మందికి కూడా ముద్ర రుణాలు అందించలేదని తెలిపారు. జిల్లాలో ఇప్పటి కిప్పుడు లక్ష మంది నిరుద్యోగులకు చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇచ్చినప్పటికీ భారతదేశ 14/ శాతం సగటున అందుకోలేమని  అన్నారు. గ్రామ గ్రామాన ఉన్న రైతు సమన్వయ సమితి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా పాలన యంత్రాంగం, అందరికీ తెలంగాణ రైతు రక్షణ సమితి చేస్తున్న విజ్ఞప్తి దయచేసి ప్రతి గ్రామంలోని రైతుల రుణాల అవసరాలు తెలుసుకొని అలాగే నిరుద్యోగ యువతకు చిన్న వ్యాపారస్తులకు స్వయం ఉపాధికి అవసరమైన ముద్ర రుణ దరఖాస్తులు స్వీకరించి వెంటనే సంబందిత బ్యాంకులలో రుణాలు పెద్దఎత్తున అందజేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా అధ్యక్షుడు మా రెడ్డి రామలింగారెడ్డి, గౌరవ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షులు రాజేశం, కార్యదర్శి భూపతి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.