కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ జూలై 24 (way2newstv.com):
కేంద్రరవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని ఢిల్లీలో  ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి కలిసారు. నేషనల్ హైవే  44 రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి కొరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి వినతిపత్రం సమర్పించారు. రోడ్ అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. 
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి

ఇప్పటికే 15మంది కి పైగా మృతిచెందగా ,50 మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారని సాధ్యమైనంత తొందరగా రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గడ్కరీ ని కోరారు. సానుకూలంగా స్పదించిన కేంద్ర మంత్రి గడ్కరీ ,త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.